కరోనా నుంచి బయటపడినా..

భువనేశ్వర్‌: కరోనా భయం ఆత్మీయ అనురాగాల్ని ఛిన్నాభిన్నం చేసింది. అనారోగ్యంతో కన్ను మూసిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు, బంధుమిత్రులు, గ్రామస్తులు అమానుషంగా నిరాకరించారు. కెంజొహార్‌ జిల్లా బలభద్రపూర్‌ గ్రామంలో ఈ విచారకర సంఘటన వెలుగుచూసింది. మెజిస్ట్రేట్‌ సమక్షంలో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆరోగ్య సేవ కార్యకర్తలు ఈ ప్రక్రియలో సహకరించారు.