అమ్మవారి గుడిలో మార్చి 31 వరకు సేవలు నిలిపివేత

 విజయవాడ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున దుర్గ గుడిలో మార్చి 31 వరకు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలను నిలిపేసినట్లు వెల్లడించారు. కేశ ఖండనశాలను, అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లే బస్సులను, లిఫ్టులను నిలిపివేశామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్‌ లిక్విడ్‌ అందజేస్తున్నామని తెలిపారు. భక్తులందరికీ వైద్యపరీక్షలు చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాక దేశ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని హోమాలు జరిపిస్తున్నామన్నారు. (హమ్మయ్యా.. మనోళ్లు వచ్చేశారు)