బాక్సాఫీస్‌ వద్ద శుభారంభం చేసిన భాగీ 3

బాలీవుడ్‌ యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధా కపూర్‌ నటించిన తాజా చిత్రం భాగీ-3. యాక్షన్‌ మూవీగా శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద శుభారంభం చేసింది. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. హోళీ సీజన్‌ బరిలో దిగి.. ప్రపంచ వ్యాప్తంగా రూ 17. 50 కోట్లు సాధించి.. తన్హాజీ రికార్డును బ్రేక్‌ చేసింది. తన్హాజీ మొదటిరోజు రూ. 15.10 కోట్లు వసూలు చేయగా భాగీ 3.. 17.50 కోట్లు సాధించింది. కాగా అభిమానులను అలరించిన ఈ సినిమా విమర్శకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. (‘డూ యూ లవ్‌ మీ’: రెచ్చిపోయిన హీరోయిన్‌!)